Tuesday, June 26, 2007

నాకు నచ్చని బ్లాగులు -- సరికొత్త శీర్షిక

:


లేఖిని
వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.

:


ఈ మధ్య నాకు నచ్చని టపాలు కొన్ని వస్తున్నాయి.వాటిని అరికట్టాలనే కోరికతో ఎంతో వినూత్నమైన, విశిష్టమైన, విలక్షణమైన, విభీషణమైన,భయంకరమైన, భీభత్సమైన, రౌద్రమైన....ఇంకా....ఇంకా ఇలాంటి వెన్నో లాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టా. ఈ దెబ్బ తో నాకు నచ్చని "ఖిచ్ ఖిచ్" టపాలన్నీ మాయం. అదేమిటంటే చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. నాకు నచ్చని బ్లాగుల పేర్లు దిష్టి బొమ్మలాగా, బూడిద గుమ్మడికాయ లాగా, నల్ల తాడుకు చుట్టిన పటిక రాయి లాగా, ఎండి పోయిన నిమ్మకాయ లాగా ఇక్కడ వేలాడ దీస్తాను. అంటే గింటే ఏమీ లేదు అలాంటి వాటిని ప్రతి రోజూ "ఈ రోజు నాకు నచ్చని బ్లాగు(లు)" కింద వాటి పేర్లు వేలాడ దీస్తా. మళ్ళీ అంటే ఇది కూడలికి(తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ కు కూడా) దిష్టి చుక్కన్నమాట. ఎన్ని దిష్టి చుక్కలున్నాయో చూసుకోవాలంటే పక్కనో లుక్కేయ్యాలి.


:

2 comments:

ప్రదీపు said...

బాగుంది మీ అవిడియా...

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీ బ్లాగు మొత్తం రంగురంగుల సెట్టింగులతో నిండిపోతే ఇక మేము చదవడానికి ఏం మిగిలింది ?