Wednesday, July 11, 2007

తానా విశేషాలు...

ఫస్ట్ డే విశేషాలు...

"అంతరంగం" ప్రసాద్ ను కలిశాను.

క్లింటన్ మాట్లాడాడట. నేను చూడలేదు.

మధ్యాహ్నం భోజనం దొరకలేదు.
రాత్రి భోజనం ఎలాగోలా తంటాలు పడి తిన్నా.

నాకు నచ్చినదేదీ కనపడలేదు.

సెకండ్ డే విశేషాలు...

నాకు నచ్చినదేదీ కనపడలేదు.
భోజనం దొరకబుచ్చుకున్నా కాస్త కష్టపడి.

థర్డ్ డే విశేషాలు...

భోజనం దగ్గరికెళ్ళడంలో అనుభవం రావడం వల్ల మధ్యాహ్నం, సాయంత్రం తొందరగానే ఆత్మా రాముడిని చల్ల బరిచా.

కార్యక్రమం చివరలో మణి శర్మ బృందం పాడిన "జనగణ మణ.." బాగా నచ్చింది. తృప్తిగా గాలి పీల్చుకుని బయటికొచ్చేశా.

హై లైట్సూ, సైడ్ లైట్సూ, డిమ్ము లైట్సూ, ఫ్లడ్ లైట్సూ, యాంగ్రీ లైట్సూ, ఫ్రస్ట్రేషన్ లైట్సూ, గూబ గుయ్ లైట్సూ : ఇవయితే వెయ్యి టపాలున్నాయ్!!! చావా కిరణ్ ని, జ్యొతక్క ని దాటి మరింత ముందుగా ఆకాశమంత ఎత్తుకు ఎగరడానికి, బ్లాగు హిట్లు పెంచుకోవడానికి ఇదే సరైన సమయం.

కంక్లూషన్: కెరీర్ బిల్డింగ్ కి చక్కని సోపానం కొన్ని రిజర్వేషన్లకు లోబడి.

అప్పుడప్పుడూ లైకింగ్ అంశాలు: తెలుగు మాట్లాడే సం పీపుల్స్.

ఎంత మందొచ్చారు: గుమ్మడి లెక్క ప్రకారం 7 లేక 8 వేలు. ఇంకొకాయన చెప్పిన ప్రకారం 12 వేలు. మరింకొకాయన చెప్పిన ప్రకారం 16 వేలు. ఆ సంఖ్య మూడు రోజులకూ కలిపా లేక చివరి రోజా అన్న చచ్చు ప్రశ్నలు బుర్రలోకొస్తే రెండేళ్ళ తరువాత ఫ్లోరిడా వెళ్ళి ఓ నాలుగు వందల దాలర్లు సమర్పించుకుని తలుపు దగ్గర నిలబడి లెక్క పెట్టుకోవాలి.

ఈ టపా చదివితే భోజనాల కోసమె అక్కడికి వెళ్ళినట్టు, మార్కులెయ్యలేక idlebrain.com వాడు సినిమా రివ్యూ రాసినట్టు ఉందా? అక్కడే వుంది కిటుకంతా.

చెప్పొచ్చేదేంటంటే విశ్వసనీయ వర్గాల భోగట్టా రాయాలా, పరిశీలకుల అంచనా రాయాలా, ప్రత్యక్ష సాక్షుల కథనం రాయాలా, విశ్లేషకుల వివరాలు రాయాలా లేక అభిజ్ఞు వర్గాల భోగట్టా రాయాలా తెలీక తికమక లో ఇలా రాసి పడేశా.

ఇట్సాల్ స్మాల్ థింగ్స్ ఐ సే....


(ఇంగ్లీష్ ఎక్కువయితే అది నా తప్పు కాదని మనవి)

5 comments:

జ్యోతి said...

?????????????????

ఏమి సేతురా లింగా?????????


పోనీలెండి దగాపడ్డ తమ్ముళ్ళిద్దరూ .. అంతా మన మంచికే...

ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే మరి..అసలు అవి తానా సభలా లేక క్లింటన్ తందానా సభలా. నాయుడూ , బాలయ్య పెళ్ళి షాపింగ్ తో పాటు ఇక్కడ డబ్బా కొట్టించుకున్నారు ..భేషో భేషు...........

కొత్త పాళీ said...

"తెల్సింది చెప్పమంటారా, తెల్సుకుని చెప్పమంటారా?" - బొమ్మరిల్లులో సునిల్ :-)

My brother, I feel your pain!

Nagaraja said...
This comment has been removed by the author.
రానారె said...

తెలుగు బ్లాగులు చాలా ఉపయోగకరమైనవి. రాబోయే తానా సభలకు వెళ్లి దెబ్బతినకుండా జనాన్ని కాపాడతాయి. ఇంతకూ ఎలా రాయాలో ఏమిరాయాలో తెలీని పరిస్థితి కలిగించిన ఈ సందర్భాన్ని గురించి మరిన్ని నిజాలను రాయండి. జ్యోతిగారన్నట్లు అంతా మనమంచికే. భవిష్యత్తులో... ఇలాంటి అనుభవాలనుకూడా తట్టుకొని నిలబడగలిగే సత్తా వస్తుంది.

Anonymous said...

@ జ్యొతకా,

అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి.

@ కొత్తపాళీ గారూ,

తెలుసుకున్నది తెలివిగా అమలులో పెడతా :-)

@ రానారె,

వచ్చే తానా సభలు చాలా పకట్బందీగా జరుగుతాయి. ఇలాటి తప్పులు మళ్ళీ జరగవు గా :-)

-- విహారి