Monday, August 20, 2007

ఈ వారం సిద్ధ – బుద్ద (20-Aug-07)

.

గమనిక :

భోజనం లో అన్ని రుచులూ కలిసిన వంటకాలు వుంటే అది వివాహ భోజనము. తీపి, వగరు, మసాలా ఘాటు…అన్ని రుచులూ కలదే ఇది. ఇది వివాహ భోజనమే కానీ వివాద భోజనము కాదని మనవి చేస్తున్నాను. ఎవరినో ఉద్దేశించి ఇది రాయటం లేదు. మనం (మన బ్లాగులు) అనే అంతరాలోచనతో రాయడం జరిగింది. నేను ఒక పుడింగి అని మాత్రం కాదు. ఇది ఎవరినైనా నొప్పించాలని కూడా రాయడం లేదు. నొప్పిస్తే క్షమించండి..క్షమించండి రెండో సారి. క్షమించండి మూడోసారి. ఇది నువ్వు కావలనే రాసావు అంటే “కాంతి” తీస్కోండి. వీలయితే సలహాలు ఇవ్వండి.ఆ చేత్తోనే తప్పులుంటే మన్నించండి.

అసలు విషయం

“అయ్యా గారూ ఈ మద్దెన ఎవరూ సినిమాలు గురుంచి రివ్యూ లు రాయడం లేదేందుకు”
“ఒరేయ్ సిద్ధా బ్లాగుల్లో అవన్నీ పెద్దగా రాయరు రా”
“అది కాదండీ మొన్నామధ్య శివాజీ సినిమా కి చాలా మంది ఉత్సాహం చూపెట్టారు గదా. అట్టాగే శంకర్ దాదా జిందాబాద్, యమ దొంగ సినిమాల మీద కూడా రాయొచ్చు కదా”
“శివాజీ సినిమా డబ్బింగ్ సినిమా రా. ఇక్కడ ఎట్లా రాసినా ఏమీ కాదు. అందులోనీ దానికి హైపెక్కువయింది. శంకర్ దాదా జిందాబాద్, యమ దొంగ సినిమాలు మన వాళ్ళు నటించిన సినిమాలు కదా ఏమి రాస్తే ఏ అభిమాని దగ్గర్నుండి తలనొప్పి వస్తుందో ఎవరికి తెలుసు. అయినా అది వాళ్ళ సొంత విషయం నీకెందుకు”
“మరి అట్లాగయితే రాజకీయ నాయకుల మీద మీరు కూడా కొంచెం వ్యంగ్యంగా రాస్తున్నారు కదా. ఇలాంటి రాజకీయ నాయకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ వుండదా”
“వుంటే వుండచ్చు”
“అట్లా అయితే మీరు ఏదన్నా రాసారని వాళ్ళకు తెలిస్తే మిమ్మల్ని హుస్సేన్ సాగర్ లో ముంచ కుండా ఒదిలి పెడతారా”
“అలా అని వాళ్ళకు భయపడాలా?”
“అంత భయం లేని వాళ్ళయితే సినిమాల గురించి కూడా రాయొచ్చు కదా”
“తప్పకుండా రాస్తా దానికి మనకు కొంచెం జ్ఞానం కావాలి కదా. అయినా నీకిలాంటి అయిడియా లొస్తున్నాయేంటి?”
“అయ్య గారూ ఒకరికి వచ్చిన అయిడియా ఇంకొకరి కొస్తే రెండో సారో మూడో సారో రాసిన వాళ్ళు రెఫెరెన్సు ఇవ్వాలా?”
“ఒరేయ్ పాండవుల వైపు వున్నవాళ్ళకు మంచి బుద్ది వున్నట్టు కౌరవుల వైపు వున్న వాళ్ళకు చెడ్డ బుద్ది వున్నట్టు. బ్లాగులు రాసే వాళ్ళందరికి ఒకే రకపు అయిడియాలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వుండబట్టే కదా వాళ్ళందరూ ఒక గుంపు గా వుంటున్నారు. రెఫెరెన్సు ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేక పోతే లేదు. నీకో విషయం తెలుసా న్యూటన్ సిద్ధాంతాన్ని న్యూటన్ కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితం కేరళ లో సిద్ధాంతీకరించి ఉపయోగంలో పెట్టారట. న్యూటనుకా విషయం తెలుసో లేదో తెలీదు. న్యూటనుకున్నంత పబ్లిసిటీ మనకు లేదు కదా”
“అయ్య గారో పబ్లిసిటీ అంటే గుర్తుకు వచ్చింది. ఈ మధ్య మొదలు పెట్టిన మొదటి బ్లాగుతోనే విపరీతమైన పబ్లిసిటీ వచ్చి తెగ వ్యాఖ్యానాలు సొమ్ము చేసుకున్న బ్లాగేదో తెలుసా”
“ఎందుకు తెలీదు సిరి సిరి మువ్వ బ్లాగు కదా”
“అయ్యా అది విషయమున్న బ్లాగు అందులోనూ పరిచయం అదిరింది. నేను మాట్లాడుతున్న బ్లాగు అసలు విషయం లేకుండా కేవలం పేరుతోనే మార్కులు కొట్టేసిన బ్లాగు”
“అర్థమయింది అది బ్లాగాగ్ని . కేవలం పేరుతోనే మార్కులేసుకోవడం అంటే అదే. టైటిల్స్ అయ్యాయి కానీ సినిమా మొదలవలేదు. అయినా ఈ మధ్య వచ్చిన కొత్తవాళ్ళు కొందరు ఇరగ దీస్తున్నారు కదా”
“ఇప్పుడు వీవెన్ గారు అందరికీ ఒక పని పెట్టారు. మీకు నచ్చిన బ్లాగులు ఓ పది చెప్పండి అని”
“అలా చెయ్యడం మంచిదే గా”
“ఏమో అయ్యగారూ అలా పబ్లిక్ గా చేస్తే కొంత మంది ఫీలవుతారేమో”
“అలా ఎందుకు అనుకోవాలి ? నన్ను ఆ పది లో చేర్చలేదు కదా ఎందుకు చేర్చరో చూద్దాం అని కసి కలిగి దొరికిన తెలుగు పుస్తకాలన్నీ చదివేసి, దొరక్కపోతే గ్రంథాలయానికెళ్ళి పుస్తకాలు పట్టుకొచ్చి చదివి బ్లాగుల్లో టపాల వర్షం కురిపిస్తారని ఎందుకు అనుకోకూడదు”.
“నాకో అయిడియా వచ్చింది. దానికి రాజీవ పది బ్లాగులు అని పేరు పెట్టేసి వై.యెస్. దగ్గరికెళితే ఏదైనా అవార్డు స్పాన్సర్ చేస్తారేమో ? ”
“నీకు బ్లాగు కిక్కు ఎక్కువయినట్టుంది. ముందు ఆ శంకర్ దాదా సినిమా భజన జెమిని టి.వి. ఛానెల్ మార్చి టి.వి.9 పెట్టు అందులో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని తెలుగు కార్యక్రమం వస్తుంది దాన్ని చూద్దాం ఏదైనా టపా రాయటానికి ఉపయోగపడుతుంది.”



.

8 comments:

వికటకవి said...

అయ్యా విహారి గారు,

అబ్బో, మీ బ్లాగ్దృష్టి బహు నిశితముగా యున్నది. సినిమా రివ్యూ అంటే గురుతుకొచ్చుచున్నది. క్రొద్ది దినముల క్రిందట మన నందమూరి బాల(బండ)కృష్ణుని మీద నాలుగు వ్యంగ్యపు మాటలు వ్రాసిన పిదప ఎవరో ఉత్తములు ఆ నా బ్లాగుని ఆర్కుట్ కు చేరవైచిరి.

ఆ క్షణముతో ఆర్కుట్ ఎంతటి భీభత్సమయిన ప్రదేశమో యెరుకయైనది. ఇక ఆ బాల బండ కృష్ణుని ఇష్ట మరియు అయిష్ట వర్గములు ఇరువురి యొక్క ఉత్తరముల వానకు తడిసి మరియు జడిసి, ఆ బ్లాగుని ప్రక్కకు బెట్టితిని.

ఏది ఏమైననూ మీరు లెస్స పలికితిరి మిత్రమా! సినీ వర్గముల సమీక్షలు బహు లలితముగ సేయవలెను నేటి దినములలో. అదియేదో అందురుగదా "నొప్పింపక తానొవ్వక..."

http://sreenyvas.wordpress.com

netizen నెటిజన్ said...

విహారి వారి పలుకు సూనృతమే!
కవిగారి వాక్కును సూనృతమే!
మరి అనృతమేమైయుండునో!

Anonymous said...

వికటకవి గారు,

అవును మరి బహు సున్నితముగా చేయవలె...

నెట్టిజెన్ గారు,

ధన్యవాదాలు.

-- విహారి

Nagaraju Pappu said...
This comment has been removed by the author.
Nagaraju Pappu said...

ఇమ్హో, అత్యుత్తమ తెలుగు బ్లాగులలో మెదటి తొమ్మిది రాంకులు మీవే, పదోది రానారె.

Yours is the most original blog - in content, form, style, organization, variety and in subtlety of expression which is quite unique. The rest of us are reporters, commentators and critiques in various guises, shapes and sizes.

The way a writer uses humor is always a litmus test of his/her mastery of the literary technique. Some sprinkle their content in humor, a few others use as a cloak but very few can think humorously.

In the preface to his book on programming, Dijkstra had the audacity to make an (in)famous remark - "for the absence of bibliography, i offer neither an explanation nor an apology". You may use this as your tag line.

Keep it up.
--నాగరాజు.

Naga said...

హహ్హహ్హా... కాంతి తీస్కోవడం అని చదివి నవ్వు ఆపుకోలేకపోయాను.

Anonymous said...

@ నాగరాజు(సాలభంజికలు) గారు,

నన్ను తీసుకొని పోయి సునీత విలియమ్స్ పక్కన పెట్టారు. వార్నాయినో. నేను మాత్రం డమాల్.

మీ ముందు నేనెంతండీ. మీకు టైములేక అలా వున్నారు కానీ మీరు తలుచుకుంటే బ్లాగు లోకం అదరదూ.

@ నాగరాజు గారు,

అప్పుడప్పుడూ అలా కాంతిగా వుండండి.

-- విహారి

రానారె said...

ఆఫీసులో బిగ్గరగా పైకినవ్వించి, ఇబ్బంది పెట్టే బ్లాగుసిద్ధులకు ఏదైనా రాజీవ శిక్ష విధించాలి.