Wednesday, May 07, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (ట్వెంటీ ట్వెంటీ, డెమోక్రసీ)

:::::::::


"అయ్య గారూ .."
"చెప్పవోయ్ సిద్ధా .."


"వైరస్ కి బాక్టీరియాకి తేడా ఏంటి?"
"బాక్టీరియా దొంగయితే వైరస్ టెర్రరిస్టు. ఏంటి సైన్సు మీద పడ్డావ్. ఏ ట్వెంటీ ట్వెంటీ మీదో పడతావనుకుంటే"


"ఒక్క చెంప దెబ్బ మూడు కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసినప్పట్నుండి దాని జోలికి వెళ్ళడం లేదు."
"అయినా మ్యాచ్ లు చూస్తున్నావ్ గా "


"అదీ...."
"అర్థమయింది లే చీర్ లీడర్ల కోసం"


"అది కాదు! మన దేశం లో అలాంటి బీదా బిక్కి బట్టలేసిన డ్యాన్సులు ఎందుకు ప్రవేశ పెట్టారు? ఏ సంప్రదాయ నృత్యాలో పెట్టొచ్చు గదా"
"వాళ్ళు వేసుకునే డ్రెస్సులకూ మ్యాచులకీ అవినాభావ సంబందం వుందోయ్"


"డ్రెస్సులకూ, మ్యాచులకూ సంబంధమేంటండీ. జార్జి బుస్షు లా మట్లాడ తారు. మరీ విడ్డూరం కాకపోతే."
"మొదట్లో అయిదు రోజుల మ్యాచులు వుండేవా? అందరూ వాటిని చూసి ఆనందించేవారా. ఎక్కువ ఆనందం కోసం తరువాత 60 ఓవర్ల వన్డే లొచ్చాయా? అవి కాస్తా 50 ఓవర్లయ్యాయా. ఇప్పుడు వాటిని ఇరవై చేశారు. ఆ ఇరవైకి తగ్గట్టే డ్రెస్సులు వేసుకుంటున్నారు."


"అయితే 5 ఓవర్ల మ్యాచులొచ్చినప్పుడు ఏ గొట్టం గాడు టీములో వున్నా స్టేడియం అంతా నిండి పోతుందన్నమాట"
"అవును అప్పుడు నువ్వు టీం లోకి వెళ్ళొచ్చు "


"!!!!!"
"అలా నోరు వెళ్ళ బెట్టకు కాస్త ముయ్. వైరసులు వెళ్ళగలవు లోపలికి. వెళ్ళి ఆ మూడు పత్రికలు తీసుకొని రా"


"ఇది గోండి చదువు కోండి. నేను పత్రికలు చదవడం మానేస్తున్నా."
"ఏరా నీ మీద సెటైరేసినందుకు ఫీలవుతున్నావా? నా మీద కూడా వేస్తుంటావు కదా సె..టై..ర్లు.."


"అది కాదండీ, ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకులో, ఏ ప్రజా సంఘాల నాయకులో తిట్టుకునే వళ్ళు. ఇప్పుడు ఈ పత్రికలోళ్ళు తిట్టు కోవడం మొదలు పెట్టారు."
"దీనికే అలా 'ఆ రెండు' పత్రికలంటే పడని వై.ఎస్. లాగా అయిపోతే ఎలా? ఇప్పుడు ఇరవై నాలుగ్గంటల తరువాత వచ్చే తిట్లే చూస్తున్నావ్. రేపో మాపో సాక్షి తరఫున ఓ టి.వి. చానెల్ వస్తుంది. అందులో వాళ్ళు గంటకో సారి, నిముషాని కోసారి ఒకర్నొకరు తిట్టుకుంటారు అప్పుడేం చేస్తావ్?"


"అందుకే టి.వి. కనిపెట్టిన వాడు తెలివిగా రీమోట్ కూడా కనిపెట్టాడు."
"నీ తెలివికి టోపీలు తీసేశాం"


"రెండు రూపాయలకి కిలో బియ్యం, రెండు రూపాయలకి పేపరూ వస్తున్నాయి కదా. ఇంకా రెండు రూపాయలకేమేమి వస్తాయి?"
"రెండు రూపాయలకే దహన క్రియలు"


***:O:***


"అయ్యా డిప్లమసీ అంటే ఏంటి?"
"భారత్ లో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ అన్నం తినబట్టే బియ్యం ధరలు పెరిగాయన్న బుష్ గురించి మాట్లాడమని మన్మోహన్ సింగు నడిగితే 'నో కామెంట్' అన్నాడు. అదే డిప్లమసీ"


"ఓహో. మన మనసులో నున్న భావాన్ని డీప్ గా మసి చెయ్యడమన్న మాట. మరి డెమొక్రసీ అంటే"
"ముందు మంచి చేస్తున్నట్టు డెమో ఇచ్చి తరువాత రక్కసి లా దోచు కోవడం. ఇంకా చెప్పాలంటే పాద యాత్ర చేసి నడిచినంత దూరం వేరే పాదాలు నడవకుండా నరికెయ్యడం."


:::::::::

3 comments:

Dr. Ram$ said...

"వెళ్ళి ఆ మూడు పత్రికలు తీసుకొని రా"

హ్హ హ్హ హ్హ.. అరిపిచ్హారు.. మంచి పంచ్ వున్న అలోచనలు వస్తాయి మీకు.. మీరు కేక.. ఇంక మీరు కదిలితే ఒంటి కాలు మీద మన్మోహన్ మీదకు దూకడము ఏమి బాలేదండి.. ఆ మహానుభావుడు మాత్రము ఏమి చేస్తాడు.. చేయడానికి ఆయన చేతిలో మాత్రము ఏమి వుంది...మీ డిప్లొమసి, డెమొక్రసి బాగున్నాయి...

phani said...

మీరు ఊహించిన 5 ఓవర్ల మ్యాచులు ఎప్పుడెప్పుడొస్తాయా అని మేమూహిస్తున్నాము.ఆ మ్యాచు లను మ్యాక్స్ చానల్లో బదులు ఫ్యాషన్ చానల్లో ప్రసారం చెయ్యాలేమో?

Anonymous said...

@ డాక్టర్ రామ్‌ గారు,

ధన్యవాదాలు.

@ ఫణి గారు,

తొందర్లోనే. అప్పుడు మిడ్ నైట్ మసాలా సినిమా బదులు. మిడ్ నైట్ మ్యాచులు వుంటాయి.

-- విహారి