Saturday, May 31, 2008

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను....

:::::::::

అసలు పాట ఆడియో ఇక్కడ

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నీ కోణము
అప్పుడే నీ బ్లాగురా... నీదిరా...

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

జాలమెంత గొప్పదైన బ్లాగుకున్న టపాలల్ల
పదునుముందు సద్దుమణుగురా
గూగులెంత పెద్దదైన ఎదుగుతున్న తెలుగుశైలి
మొక్క ముందు చిన్నదేనురా

యాడులోన యాడొ వుండి సిస్టం ని మింగు స్పైయ్యివేరు
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని బ్లాగరుండ చీపుట్రిక్కులెంచుకుంటు
అడుగుహిట్ల మునుగుతుందిరా

దోష దారులెంతసేపురా
భాషోదయాన్ని ఎవ్వడాపురా
వెలుగుతున్న బ్లాగు కూడా శౌర్యగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

నొప్పి లేని నిముషమేది లైవు యైన స్క్రాపు యైన
ప్రాజెక్టు అడుగుమడుగునా
బాసుచూసెనంటు నిలిచిపోతే కూడలైన నీది కాదు
బ్లాగు అంటే బాహ్య ఘర్షణ

శైలి వుంది శిల్పముంది
కూడలుంది జల్లెడుంది
అంత కన్న సైన్యముండునా

వ్యాఖ్య నీకు వాయువౌను
క్లిక్కు నీకు కీర్తనౌను
సమీక్ష నీకు సారధౌనురా

భీతిలేని బ్లాగుడున్నదా
సాహిత్యమంటు శిశువు పుట్టదా

అగ్రిగేటరంటు వున్న వరకు
భీరువంటు పారిపోక
బ్లాగు పైన భాషపతాక మెగురవేయరా…

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

********************


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

విశ్రమించవద్దు ఏ క్షణం.
విస్మరించవద్దు నిర్ణయం.
అప్పుడే నీజయం నిశ్చయం రా.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండు రవిని మింగు అసుర సంధ్య
ఒక్క నాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి విండ సాగరాల నీదు కుంటు
తూరుపింట తేలుతుందిరా

నిషావిలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుంత గుండె కూడ సూర్య గోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరశించి నిలిచిపోతే నిమిముషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

ఆశ నీకు అస్త్రమవును..
శ్వాశ నీకు శస్త్ర మవును.
ఆశయమ్ము సారధవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక.
శవము పైన గెలుపు చాటురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..


సిరివెన్నెల గారికి క్షమాపణలతో

5 comments:

ఏకాంతపు దిలీప్ said...

@విహారి గారు
సిరివెన్నలగారు కూడా ఈ పేరడీని చూసి మనస్పూర్తిగా నవ్వుకుంటారు... ఇందులో సదుద్దేశం ఉంది కాబట్టి
మీరు అసలు సిసలు తెలుగు బ్లాగరు... తెలుగు బ్లాగరను జాగృతం చెయ్యడానికి ఇంతకన్నా ఎవరు రాయలేరేమో... చాలా బాగుంది...

venkat said...

vihari garu bagundi sir kavita

KK said...

విహారి గారు! చాలా బాగుంది. మీలో ఇంత కవితా శక్తిని చూడటం ఇదే ప్రధమం. మంచి టపా ఇది.

శివకుమార్ said...

అన్నా హాస్యమే కాదు కవితలు/పాటలు తో కూడా అలరిస్తున్నారు... మీకోటి చెప్పాలని ఉంది గత సంవత్సర కాలంగా మీ బ్లాగ్ ను తప్పక చదువుతున్నాను (క్షమించాలి కామెంట్స్ రాసింది చాలా తక్కువ) మనసు బాగోలేనపుడు ఒత్తిడి ఉన్నపుడు ఎలుకను పట్టుకొని చావబాదుతుంటాను నూతన ఉత్సాహం కోసం, విహారన్న బ్లాగ్ లో ఒక హాస్య గుళికైనా దొరక్కపోతుందా అని (ఎలాగూ కొత్త టపాలు నేరుగా నా తపాల డబ్బాలో పడుతాయ్ అయినా....) ఏదో ఆశ...

Anonymous said...

@ దిలీప్ గారు,
మీ అభిమానానికి ధన్యుణ్ణి.

@ వెంకట్ గారు,
నెనర్లు
@ నువ్వు సెట్టి గారు,
అప్పుడప్పుడూ వ్రాస్తుంటా. పక్కన లంకెల్లో నా కవితల బ్లీగు కూడా వుంది.

@ శివ కుమార్ గారు,
మీలాంటి వారి ప్రోత్సాహమే నాకు కొండంత అండ.

-- విహారి