ముక్కులో మైకు కార్యక్రమం
"మీరు కాంగ్రేసులో చేరుతున్నారా?"
"మాకు వై.ఎస్. విధానాలు నచ్చాయి అందుకే కాంగ్రేసు పార్టీ నచ్చింది. ఇప్పుడున్న జల యజ్ఞం ప్రాజెక్టులు సరైన సమయానికి పూర్తయితే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేరు."
"కొత్తగా పార్టీలొస్తున్నాయి కదా వాళ్ళు కూడా కాంగ్రేసు మీద ప్రభావం చూప లేరా?"
"నో వే. కొత్త నాయకులు ఎవరొచ్చిన కాంగ్రేసు మీద ప్రభావం చూపలేరు. వచ్చే ఎన్నికల తరువాత కూడా వై.ఎస్సే. సి.ఎం. "
అడిగింది పాత్రికేయులు. చెప్పింది సినీ నటి జీవిత.
మైకు కట్ చేస్తే హెడ్లైన్......
చిరంజీవి ముఖ్యమంత్రి కాలేడు అన్న జీవిత
:::::::::
5 comments:
@విహారి గారు
ఆయన అవుతాడు అంటే ఈయన అవ్వడనే కదండి!!
ఇక (కారు దాడి,ఆఫీసు దోపిడి !! ) తరువాత వాళ్ల పెరట్లో మొక్కలు పీక్కు వెళ్లడమే మిగిలింది ;)
అర్థాలకంటే, పెడర్థాలు తీస్తేనే గొప్ప జర్నలిజం అయిపోయింది.సెన్సేషన్ కావాలికదా మరి! అందుకే ‘జర్నలిజాన్ని’ ‘సెన్సేషనలిజం’ గా అర్జంటుగా పేరుమార్చెయ్యాలి.
రాజశేఖర్ ఇంతకు ముందు తెలుగుదేశం అభిమాని కదా. పోయిన సారి, అంతకు ముందూ తెదెపాకి అనుకూలంగా ప్రచారం కూడా చేసినట్లు గుర్తు. అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలో చేరటం ఈయన విధానమా?
అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బగుపదినట్టు ఎక్కడా లేదు. జీవిత ఎక్కడ పోటీ చేసినా deposits కూడా రావు. దీనికి మనందరం "సాక్షి" .
@ భరత్ గారు,
వాళ్ళు కావాలనే అలా లాగారు అంతే.
వ్యాఖ్యకు నెనర్లు.
@ మహేష్ గారు,
వాళ్ళకు సెన్సేషన్. చదివే వాళ్ళకు ఫ్రస్ట్రేషన్.
నెనర్లు.
@అబ్రకదబ్ర గారు,
ఆవేశం డైలాగులు చెప్పి చెప్పి అలసిపోయాడేమో.రాజకీయం డైలాగులు వంట బట్టించుకున్నారు.
వ్యాఖ్యకు నెనర్లు.
@శివ గారు,
సామెంతెందుగ్గానీ. జీవితకు రోజాకు పోటీ ఎలా వుంటుందో చూడాలి.
వ్యాఖ్యకు నెనర్లు.
-- విహారి
Post a Comment