Monday, June 16, 2008

మా ఇంట్లో ఫాదర్స్ డే.

:::::::::



పిలకాయల్కి పరీక్షలయిపోయినాయి. నిన్న ఆదివారం ఇంటికి కొందరోస్తే బార్బక్యూ పార్టీ మొదలెట్టా మొక్క జొన్న కంకుల్తో. ఇంటి వెనక డెక్ మీద కుర్చీలేసుకుని కూర్చున్నాం. అప్పుడప్పుడూ గ్రిల్లు మీద కంకులు సరీగా కాలుతున్నాయో లేదో అని లేచి చూసి వస్తున్నా. అలా లేచి కాలుస్తూ వుంటే మా పెద్ద బుడ్డోడు వచ్చి “నాన్నా నువ్వెక్కడ కూచున్నావ్” అని అడిగాడు. నేను కూర్చునే కుర్చీ చూపించా. తరువాత నన్నటు తిరగమన్నాడు. సరే అని మొక్క జొన్న కంకుల్ని తిప్పడం లో లీనమైపోయా. కాసేపటికే “నానా! నువ్వెళ్ళి నీ కుర్చీలో కూచో” అని ఒకటే రొద. వీడేమన్నా (ఇంకో ఇద్దరు గడుగ్గాయిలు కూడా వున్నారు) కుర్చీ కి కాలు గానీ పీకేశాడేమో అని అనుమానమొచ్చింది కానీ అవి మడత కుర్చీలు కాబట్టి విరిచే చాన్సు లేదు. దగ్గరికెళ్ళి చూస్తే దాని మీదో తెల్ల కవర్. అంతకు ముందే ఈ పిల్లకాయలందరూ ఏదో బొమ్మలు గీసుకుంటామంటే కొన్ని తెల్ల కాగితాలిచ్చా. వాటితోనే కవర్ లాంటిది చేసి అందులో ఒక జాబు పెట్టాడు. దాన్ని తెరిచి చదివితే.

Dear Dad,

Happy father’s Day. You are the best daddy in the world. Can you please take me on a vacation(trip) for a week.

-- Rushil Vihaari


దీన్ని చదవగానే వాడిని వెకేషన్ కు తీసుకెళ్ళాలో లేక వెకేషన్ కోసం నన్ను ప్రపంచంలో బెస్టు చేశాడో అర్థ కాలా.

:::::::::

6 comments:

Unknown said...

Dad is always the best for the kids . Though mom take care of all their needs, they love to play with Dad !

deentlo maatram no exception!
:)

mimmalni praise chestu panlo panigaa wish list chadivesaademo !

Unknown said...

అంతా పోలిటిక్స్. మదర్స్ డే ఏమో స్కూల్ ఉన్నప్పుడు పెట్టారు. మదర్ కోసం స్కూల్లో పిల్లలచేత అన్ని రకాల గ్రీటింగ్ కార్డ్స్, పెయింటింగ్స్ వగైరా వగైరా చేయిస్తారు. అక్కడితో అయిపోతుంది. మరి ఫాదర్స్ డే కి ఒక తెల్ల కాగితం మీద సింప్ ల్ గా "Happy Fathers Day" అని ఒక చిన్న నోటు రాసి, క్రింద కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ - వాళ్ళ వెకేషన్ కి సరిపడా రాస్తారు. ఇక వెకేషన్ కి తీసికెళ్ళక చస్తామా?

రాఘవ said...

బాగుంది బాబూ :D
ఇంతకీ మీ బుడ్డోళ్ళని వెకేషన్‌కితీసుకు వెళ్తున్నారా లేదా?

కొత్త పాళీ said...

తండ్రిని మించిన తనయుడని ఇదివరకే ప్రూవైపోయిందిగా, ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యం ఎందుకూ!
ఈ కాలపు బుడ్డోళ్ళు ఎలాగున్నారంటే మనల్ని సుఖపెట్టడానికి కనిపెట్టబడిన ఈ దినాల్ని కూడా వాళ్ళకి ఎడ్వాంటేజిగా ..

జ్యోతి said...

That is junior vihaari.. :)

Anonymous said...

@వేణు గారు,
అంతే అంతే. టెండరు ఎక్కడ వెయ్యాలో అక్కడ వేస్తారు.
నెనర్లు.

@కె గారు,
ఇందులో కూడా రాజనీతి వుందా. వాణిజ్య శాస్త్రం చదివిన వాళ్ళు వ్యాపరం పెంచుకోడానికి చేసిఅతి పెద్ద కుట్రల్లో ఇదొకటి.
నెనర్లు.

@రాఘవ గారు,
కాదనే గుండె నా ఒంట్లో లేదు.

@కొత్త పాళి,
కొన్నింటిలో వీడు మాత్రం నన్ను దాటి రెండు వందల మైళ్ళ దూరం లో వున్నాడు.
నెనర్లు.

@జ్యోతక్క,
వీడు సీనియర్ అయ్యేటప్పటికి నేను జూనియర్ అవుతానేమో.

-- విహారి