ఈ వారం సిధ్ద -- బుద్ధ(బత్తీ బందు, బ్లాగులు, సినిమాలు)
:::::::::
అయ్యా!!!
ఆ సిద్ధా.
అయ్య గారూ?
అలా వణుకుతున్నావెందుకు చెప్పు.
నాకు భయమేస్తోందండి
ఎందుకురా పెట్రోల్ గానీ స్టాకు ఎక్కువ పెట్టావేంటి. బ్లాకు లో అమ్మటానికి వుంచావని కేస్ పెట్టి జైల్లో తోస్తారని భయమా?
అట్లాంటి దేదయినా జరిగితే మీరు చూసుకుంటారు గదా నాకేం భయం. ఇప్పుడొచ్చిన భయమల్లా నిన్న రాత్రొచ్చిన కలేనండి.
నీకు భయమెందుకురా మొన్నే బత్తి బందు కోసం అందర్నీ కలిసొచ్చావ్ కదా. కొంచెం హవా పెరుగుంటుంది.
ఆ తరువాత వచ్చిందే ఈ కల.
వాళ్ళేదో పదవి ఇస్తామని ఆశ చూపించుంటారు. వాటి గురించి డిస్కో లైట్ల పగటి కల కనుంటావ్. అవే మళ్ళీ రాత్రి వచ్చుంటాయ్.
మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. చెబుతా వినండి.
వినటానికే నా చెవులున్నాయి కానీ.
నేను బాగా నిద్ర పోతున్నానా. ఉలిక్కిపడి లేచి చూసేసరికి నా మొహం మీద ఏదో పక్షి వాలినట్టయింది. కొంచెం దగ్గరగా చూస్తే రెండు కళ్ళు. ఒక కంట్లో జానీ వాకర్ విస్కీ కింద పోసేస్తే చారలు కట్టినట్లు ఎర్రగా జీరలు. ఇంకో కంట్లో ఓల్డ్ మాంక్ రమ్ము కింద పోస్తే చారలు కట్టినట్లు జీరలు ఎర్రగా. ఇదేదో రాకాసి నన్ను పీక్కు తింటోదని పై ప్రాణాలు పైనే పోయాయి. వచ్చే సంవత్సరం ఈ రోజే నా సంవత్సరీకం జరుగుతుందని గుండె గుభేల్మంది. అంతలో కొంచెం కొంచెంగా ఆ ప్రాణి వెనక్కు వెళ్ళింది. అలా వెళ్తుంటే అప్పుడు అర్థమయింది ఆ జీవి ఎవరో. అది నేను చూసిన మొహమే.
:::::::::
ఏరా నేను బత్తీ బందుకు అనుకూలంగా లేననుకున్నవ్రా?
అలా అని ఎవరన్నారన్నా.నీకు అందరూ అగర్బత్తి లు వెలిగించి పెడుతున్నారంట గదా.
అంటే నీ ఉద్ధేశ్యమేంది? ఓటర్లు నాకు అగర్బత్తి ఎలిగించి పొగ బెడితే నువ్వు నాకు బ్లాగులో సెగ బెడతావ్ రా?
అబ్బే నా ఉద్ధేశ్యం అది కాదన్నా.మీరారోజు దొరక్కపోతేనూ..
ఓటర్ల దగ్గర నా మార్కులు సున్నా అయిపోయినాయని నేనేడస్తా వుంటే బత్తీ బందని పేరు చెప్పి నేను కొద్దో గొప్పో మార్కులేసుకునే చాన్సు కూడా లేకుండా చేస్తావ్ రా? ఏమ్రా నీదేం బ్లాగ్రా?
ఏదో బడుగు బ్లాగన్నా?
బడుగోడయితే అడుగు రాతల్ రాస్కోక ఈ రాతలేంద్రా? మా పేపర్ల బాడుగ బ్లాగని హెడ్డింగ్ వెట్టి రాయించమంటావేంది భే.
అంత పని మీకెందుకన్నా.
రేయ్. ఈ రోజు నేను దంచుడో..నువ్వు చచ్చుడో తేలి పోవల్ల.
అన్నా! నీకు చింత చచ్చినా పులుపు చావలేదే.నీ కల్మొక్తా నన్నొగ్గెయ్. నువ్వు బత్తీ బందు జేస్తున్నవని నా బ్లాగ్ల రాస్త. మీ దెబ్బకి దిల్లీ దర్బార్ ల కూడ బత్తీ బందు చేస్తుండ్రని గూడా రాస్తా. మీ దిల్ కుష్ చేస్తా.
గట్లన్నావ్ బావుంది. నే వస్త. జర దిమాఖ్ దగ్గర్ వెట్టుకొని బ్లాగ్ రాయ్. లేకపోతే చండాలొలుస్తా తమ్మి.
:::::::::
అదీ అయ్యగారూ సంగతి.
ఇంకేం కె.సి.ఆర్. బత్తీ బందుకు సపోర్టని అందరికి చెప్పు. నీ ప్రాబ్లెం సాల్వయిపోతుంది. నువ్వా తరువాత ఏం ఫికరవ్వక్కరలేదు.
హమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వుంది. ఏవైనా శుభ కార్యాల గురించి మాట్లాడుకుందాం ఇంక.
అలాగే బాబు 'మీ కోసం' యాభై రోజుల పండగ గురించి మాట్లాడుకుందామా?
మళ్ళీ రాజ కీయాలా? అదొద్దు గానీ. మొన్న మీ ఫ్రెండు వాళ్ళ కజినెవరికో అమ్మాయి కావాలని అమెరికా నుండి వచ్చాడు కదా. ఎవరైనా మంచి అమ్మాయి దొరికిందా?
మంచి సంగతి పక్కన పెట్టు అసలు వాడికి అమ్మాయి అనే పదార్థం దొరకటమే కష్టమయిపోతోంది.
ఏం ఎందుకలా. అమెరికా సంబంధమంటే ఎగిరి గంతేసి పెళ్ళి చేసుకుంటారు కదా.
అది ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. అక్కడున్నోళ్ళే తట్టా బుట్ట సర్దుకుని ఇక్కడికొచ్చేస్తున్నారు. మా వాడిని ఏరా ఎందుకు అమ్మాయిలు దొరకడం లేదు అంటే అంధ్రజ్యోతి పేపర్లు తీసుకొచ్చి నా ముందు పడేశాడు.
అందులో పెళ్ళి ప్రకటనలు రావడం లేదని బాధేమో
అది కాదులేరా. ఇదిగో ఆంధ్రజ్యోతి హెడ్లైన్‌లు చూడు, అమెరికాలో హాహా కార్, అమ్మబోతే అడవి, ఒక ఇల్లు కొంటే ఇంకో ఇల్లు ఫ్రీ, కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్. ఇలాంటివి చూస్తే పిల్లనిచ్చే తండ్రెవరైనా అమెరికా సంబంధం వైపు కన్నెత్తి చూస్తాడా?
పాపం. ఆ అబ్బాయినే భారత్ వచ్చెయ్యమన్లేక పోయారా?
వద్దామనే అనుకున్నాడు. ఇక్కడున్న నెల రోజులు జనాలు పెట్టే ఖర్చు చూసి తట్టుకోలేక వీళ్ళతో నేను పోటీపడ లేనని చేతులెత్తి వెళ్ళి పోయాడు. పైగా వాడు అక్కడనుండి తెచ్చుకొన్న సెల్ ఫోను చూసి వాడి ఫ్రెండ్సందరూ అదో డొక్కు ఫోను మేము ఆ ఫోను తరువాత వచ్చిన రెండు మాడల్స్ కూడా కొని పారేశాం అన్నారట.
అమెరికాంధ్ర వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గమయిందన్నమాట. అక్కడుండలేరు. భారత్ కి రాలేరు. ఎటూ పెట్రోల్ ఖర్చులు పెరిగి పోతున్నాయి కదా భారత్ నుండి కానీ చైనా నుండి కానీ ఎగుమతి చెయ్యాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అక్కడే సెజ్(special economic zone) పెట్టుకొని ఏవైనా ఉత్పత్తి చేసుకుని అమ్ముకుంటే మంచి లాభసాటిగా వుంటుంది.
అయిడియా బావుంది. కానీ అక్కడ వాళ్ళకు చేత కాదనా ఇతర దేశాల నుండి కొనుక్కునేది. అక్కడ తయారు చేస్తే వాళ్ళ వాతావరణం కలుషితమై పోదూ?
పెద్దన్న తెలివితేటలు తక్కువగా అంచనా వేశా. నాటకాలెయ్యడం లో సిధ్ధహస్తులు కదా. అవార్డులు రావుగానీ అలాంటి వేవన్నా వుంటే అన్నీ పెద్దన్న కే ఇచ్చేయ్యాలి.
పెద్దన్నంటే గుర్తొచ్చింది. తెలుగు పరిశ్రమ లో పెద్దాయన అని పిలవబడే రామానాయుడు తీసి నటించిన 'హోప్' సినిమా కు జాతీయ అవార్డు వచ్చింది.
అదో సినిమా వుందా? దేని గురించా హోప్? అమెరికా కెలా వెళ్ళాలనా?
కాదు. పిల్లలు పరీక్షల్లో మంచి మార్కుల కోసం బాగా చదవాలనే వత్తిడిలో ఎంత మానసిక సంఘర్షణ కు లోనవుతారు. ఆ వత్తిడిలో ఆత్మ హత్య చేసుకునే పరిస్థితిలొస్తాయనే దాని గురించి చెబుతుంది ఈ సినిమా.
మంచి సందేశాత్మక సినిమానే.ఇంకా మన తెలుగు సినిమాల కేమన్నా అవార్డులు వచ్చాయా?
కిట్టు అనే యానిమేషన్ సినిమా కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.
ఈ సంవత్సరం గుడ్డిలో మెల్లన్నమాట.మంగ తాయారు టిఫిన్ సెంటర్ కు అవార్డొస్తుందేమో అనుకున్నా
:::::::::
ఈ సారి బ్లాగుల్లో ప్రత్యేకతేంటి?
తేనెగూడు డౌనయ్యింది.
ఇంకా.
కొత్త బ్లాగర్లు పిచ్చ పిచ్చగా రాసేస్తున్నారు. ఒకప్పుడు పది కామెంట్లున్న టపా చూడాలంటే వారానికొకటి కానీ కనపడేది కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళు కత్తి కాంతా రావు లా కత్తి పట్టుకొని ముందుకు దూకేసి 'టపాకో పది' అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ ప్రవాహంలో చదవకుండా కొట్టుకు పోతున్న బ్లాగులెన్నో.
మంచి పరిణామం. రేపో మాపో బ్లాగర్లకోసం ఓ ఎమ్మెల్సీ సీటు అడగొచ్చు.
నీకు బాగ ముదిరింది.
మీకు మల్లే.
!!!
:::::::::
7 comments:
ఈడ తెలంగాణా డెమోక్రటిక్ ఫ్రంట్ అనొకటుంది విహారన్నా... జర భద్రం. ఆడ దంచుడైంది గదా, ఇగ ఈడ దంచుడు షురూ చేస్తరు. :-)
:)
అవును. 'అయ్యో! ఈ బ్లాగ్ ఇంత వరకూ నా దృష్టి లో ఎందుకు పడలేదు?!' అని అనుకోవటం ఎక్కువ అయింది. ఎన్ని బ్లాగ్లో! ఎక్కడ దాక్కుంటున్నాయో?!
bravo vihari.
@ sujata .. అయ్యో మీరింత వరకూ విహారి బ్లాగే చూళ్ళేదా? అర్జంటుగా ఒక మధ్యాన్నం తీరిక చేసుకుని పాత టపాలన్నీ చదివెయ్యండి. నవ్వుకి వచ్చే కన్నేళ్ళు తుడుచుకోడానికి ఒక పెద్ద సైజు టర్కీ టవలు అందుబాటులో ఉంచుకోండి.
హహహ...
@వికటకవి,
తెగించినోడికి ఏమయినా పర్లేదు. ఈ మధ్య బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొన్నా.
:-)
నెనర్లు.
@ఒరెమూనా,
ఏవిటీమధ్య ఎక్కడ చూసినా ':-)' లు మాత్రమె కనిపిస్తున్నాయి? కొత్తపాళీ బ్రేవో, కూల్, సెహ్బాస్ లా, నెటిజెన్ కేక లా స్మైలీల పేటంట్ తీసుకున్నారా?
:-)
@సుజాత గారు,
అవును కదా.
నెనర్లు.
@కొత్త పాళి,
సుజాత గారన్నది ఇతర బ్లాగుల గురించి కదా. ఏఁవిటో ఈమధ్య అందరూ హడావిడిగా చదివేసి హడావిడిగా కామెంటేస్తున్నారు. ప్చ్..వున్నవి 24 గంటలు. చదవాల్సినవి బోలెడు.
నెనర్లు.
@ప్రవీణ్,
:-)
-- విహారి
కామెంటు వ్రాయకపోతే వ్రాయలేదంటారు! వ్రాస్తేనేమో స్మైలీనేనా అంటారు :)
వివరణ
:) Enjoyed the post with a smile.
! చదివి ఆశ్చర్యపొయినాను.
10/10 సూపర్
10/10; 10/10 -- సూపర్ డూపర్
5/5 - బాగుంది.
1/5 - బాగోలేదు.
Post a Comment