Thursday, June 19, 2008

ప్చ్..ఏవిటో పిల్లలు

:::::::::


పిల్లలకి సెలవులొచ్చాయి..అమెరికావాళ్ళకి లెండి. ఊరుకుంటారా? అదని ఇదని కాకుండా సింపుల్ గా "పందిరి దాని పీకుడు" అనే స్పెషల్ కార్యక్రమాలు కొత్త పద్దతుల్లో మొదలుపెడతారు. ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడూ అడ్డుతగులుతూ కొన్ని కబుర్లు చెప్పాలి లేకపోతే "బ్యాంకు దానికో పెద్ద చిల్లు" అనే కార్యక్రమం లో మనం పాల్గొనాల్సి వుంటుంది. అలాంటి కబుర్లు కార్యక్రమం లో కొన్ని.

పెద్దయిన తరువాత నేను BMW కారు కొనుక్కుంటా.
ఏం మన బెంజ్ బాలేదా? నీ ఫ్రెండ్ వాళ్ళ లెక్సస్ కన్నా ఇదే బావుందన్నావ్ కదా

నేను డిఫరెంట్ కారు కొనుక్కుంటా.
సరే అయితే అందులో ఎవర్ని ఎక్కించుకుంటావ్? (మనసులో ఆహా అమ్మానాన్నల్ని ఎక్కించుకుంటాడు అని ఒక ఆనందం)

నేనూ నా వైఫూ, నా కిడ్స్.
అదేంట్రా మేమెక్కద్దా?

అప్పుడప్పుడూ ఎక్కించుకుంటాలే.
???

:::::::::


నేను ఆడుకోడానికి చక్కీ చీజ్ వెళుతున్నా.
ఒరేయ్ నువ్వు బయటికెళ్తున్నావ్ కదా నీ ఫ్రెండ్సు నీ గోళ్ళు చూస్తే యక్కీ బాయ్ అంటారు. గోళ్ళు కత్తిరించనా?
అలాగే.

చేతి గోళ్ళు కత్తిరించడం పూర్తయ్యాక.

అయిపోయిందా?
చేతులకు అయిపోయింది.కాళ్ళు ఇలా పెట్టు వాటికి కూడా గోళ్ళు కత్తిరించాలి.

అవసరం లేదు అవి కనిపించవ్. వాటికి షూష్ వేసుకుంటా కదా. బై
???

:::::::::

2 comments:

కొత్త పాళీ said...

మీరు చిన్నప్పుడు ఇల్లుపీకి పందిరి వేస్తే మీ తనయులు దాన్ని కూడా పీకే కార్యక్రమంలో ఉన్నారన్నమాట! తండ్రిని మించిన తనయులు కదా .. అన్నట్టు ఇప్పుడు ఫోన్ ఆన్సరింగ్ మెషిన్ గ్రీటింగ్ మార్చాలేమో .. రాజూ .. రాణీ ఐపోయింది .. యువరాజులు వేటకెళ్ళారు. తిరిగొచ్చాక మీ విన్నపం వింటారు ..

Anonymous said...

@రాఘవ గారు,
:-)

@కొత్త పాళి,
నా ఫోను మెసేజి ఇంకా గుర్తుందా :-)
నెనర్లు.

-- విహారి